14 June, 2026 | 1:35 AM

మెల్లకుంట తండాలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

13-06-2026 04:19 PM

క్వింటాల్‌కు రూ.3,699 రూపాయలు

నాగిరెడ్డిపేట్,జూన్ 13 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ సహకార సంఘం పరిధిలో గల మెల్లకుంట తండాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం పీఏసీఎస్ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి,స్థానిక నాయకులతో,రైతులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తాండూర్ సొసైటీ చైర్మన్ అకిడి గంగారెడ్డి మాట్లాడుతూ...రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.3,699 రూపాయల మద్దతు ధరకు విక్రయించి లబ్ధిపొందాలని తెలిపారు.

ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.బయట దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు.కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి జొన్న కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్య నాయక్,తాండూర్ సొసైటీ అధ్యక్షుడు అకిడి గంగారెడ్డి,ఉప అధ్యక్షులు మిద్దె బాబురావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, నాయకులు వస్త్రం నాయక్, వజ్రా నాయక్,బన్సీ,కిషన్ నాయక్,హనుమ,రవీందర్ రెడ్డి,సీఈవో మురళి, గ్రామస్తులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.