14 June, 2026 | 12:11 AM

మానవ మృగాన్ని కఠినాతి కఠినంగా శిక్షించాలి

13-06-2026 04:21 PM

బీసీ నేతలు ధూళిపాళ ధనుంజయ  నాయుడు  డిమాండ్.

నేరేడుచర్ల, జూన్ 13(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో రజక బాలికపై అత్యాచారం జరిపి హత్యాయత్నం చేసిన మహమ్మద్ గౌస్ పాషాను కఠినాతి కఠినంగా శిక్షించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు, బీసీ జేఏసీ నాయకులు జింకల భాస్కర్ సరికొప్పుల నాగేశ్వరావు బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఇంజమూరి మల్లయ్య కల్లూరు మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..

 రజిక బాలికపై జరిగిన దమన కాండను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా  నేరేడుచర్ల ప్రధాన కూడలిలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు వాసపల్లయ్య భత్తిని శ్రీనివాస్, రెడ్డిపల్లి బిక్షం బండి శ్రీనివాస్ గోలి వెంకట్ రెడ్డిపల్లి రాంప్రసాద్ కాపర్తి శ్రీనివాస్ మొగరాల సత్యనారాయణ జంపాల శ్రవణ్ రెడ్డిపల్లి వినయ్ పాల్గొన్నారు.