9 May, 2026 | 4:32 AM

అత్తపై అల్లుడి లైంగికదాడి!

09-05-2026 12:00 AM

వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్‌లో ఘటన

వట్‌పల్లి(సంగారెడ్డి), మే 8(విజయక్రాంతి): కూతురు, అల్లుడు గొడవలు పడుతున్నారని నచ్చజెప్పడానికి వచ్చిన అత్తపై బలవంతంగా అల్లుడు లైంగికదాడికి పాల్పడిన అమానవీయమైన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో జరిగింది. వట్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన మహమ్మద్ గరీబ్ ఆందోల్ మండలం అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన హీనాఫాతిమాను వివాహం చేసుకున్నాడు.

అయితే భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త మహ్మద్ గరీబ్ మద్యం సేవించి హింసిస్తున్నాడని హీనాఫాతిమా తల్లికి చెప్పింది. వీరి గొడవలను ఆపి నచ్చజెప్పడానికి గ్రామానికి అత్త వచ్చింది. అయితే మద్యం మత్తులో ఉన్న గరీబ్ భార్యను నెట్టేసి అత్తను గదిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.