మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య
15-05-2026 07:49 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాటు సోమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రానికి చెందిన సోమయ్య చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే సేవలందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి శుక్రవారం కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సోమయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన పార్టీ ఒక్కోరికీ సోమయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు అందరూ తనకు అండగా ఉండాలని కోరారు.






