26 August, 2026 | 6:56 PM

మదర్ థెరిసా 116వ జన్మదిన వేడుకలు

26-08-2026 06:03 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో క్రైస్తవ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డు గ్రహీత సెయింట్ మదర్ థెరిసా 116వ జన్మదిన వేడుకలు బుధవారం  ఘనంగా నిర్వహించారు. పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ... మదర్ థెరిసా చిన్నతనంలోనే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని, అనాథలు, నిరుపేదలు, నిరాశ్రయులు, కుష్ఠురోగుల మధ్య విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. 

జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ సుందర్ రావు ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య, క్రైస్తవ నాయకులు శాంతవర్ధన్, కాపుగల్లు ప్రసాద్, పాస్టర్లు సుందర్ రావు, ప్రభుదాస్, మోసెస్, పాండు, కరుణ, సమీరా, ఎలిసిమ్మ, శీబాషాలని తదితరులు పాల్గొన్నారు.