మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు
26-08-2026 06:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గౌస్ ఏ ఆజాం మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ... మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గదర్శకాలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.
అనంతరం మహమ్మద్ ప్రవక్తను స్మరించుకుంటూ ఆయన నిజ జీవితంలో పాటించిన సూత్రాలు ఆచరణాలపై శ్లోకాలు, గీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలాన అన్వర్ పాషా ఖాద్రి, షేక్ ఫెరోజ్, అన్వర్, గౌస్ ఏ ఆజాం మీలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అశ్రార్ ఖాద్రి, ఉపాధ్యక్షులు మొహమ్మద్ లతీఫ్, ప్రధాన కార్యదర్శి ఇసాక్ అలీ ఖాద్రి, సహాయ కార్యదర్శి షేక్ రహ్మత్, కోశాధికారి ఇర్ఫాన్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.






