గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం
12-03-2026 11:47 AM
భిక్కనూర్, మార్చి12(విజయ క్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని గాజులపేట కాలనీలో నీటి ఎద్దడిని నివారించేందుకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొమ్మిదో వార్డ్ సభ్యుడు గజ్జె వేణు ఆధ్వర్యంలో బోరు మోటర్‌ను ప్రారంభించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రోల్ల రాజు, సురేష్ గౌడ్, గంగల రవీందర్, బండి సత్యం, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు ఈ చర్యను అభినందించారు




