18 August, 2026 | 7:59 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

ప్రజాస్వామ్యబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి

16-05-2026 01:46 AM

అశ్వాపురం మే 15 (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు కమటం వెంకటేశ్వరరావు, అనంతనేని సురేష్ మాట్లాడుతూ రైతులకు సేవలందించాల్సిన సొసైటీల్లో ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం, తూకం, చెల్లింపుల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.