16 May, 2026 | 2:30 AM

అన్నదాతను ముంచిన ప్రభుత్వం

16-05-2026 01:46 AM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 15 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆరోపించారు.

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పేరుకుపోయిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కల్లాల్లో వడ్లు ఆరబోసి రైతులు వారాల తరబడి ఎదురుచూస్తున్నా, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంపై మండిపడ్డారు.

ఈ మేరకు రైతుల సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.మరో వైపు మిల్లర్లతో చేతులు కలిపిన అధికారులు కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎటువంటి కొర్రీలు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.