20 May, 2026 | 3:57 PM

Breaking News

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •  

సమాజ అభివృద్ధి సామాజిక సేవ చేయాలి

02-11-2025 06:25 PM

నిర్మల్ (విజయక్రాంతి): సమాజ అభివృద్ధికి సామాజిక సేవతో ముందుకు వెళ్లడంలో ఆర్యవైశ్య సంఘం ముందుంటుందని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కాలువ సుజాత గుప్తా అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఆమెడ శ్రీధర్ తో పాటు కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘం ఐక్యత సాధించుకుంటూనే హక్కుల కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

చట్టసభల్లో ఆర్యవైశ్యుల ప్రాథమిక పెరిగినప్పుడే మన సమాజానికి ఉపయోగపడతామని ఆ దిశగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్మల్ జిల్లా కార్యవర్గం సామాజిక సేవలో ముందు ఉంటుందని అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.