20 May, 2026 | 5:01 PM

మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్

20-05-2026 03:41 PM

- అర్ధరాత్రి మైనర్ బాలికతో కానిస్టేబుల్ వివాహం

- పోలీస్ శాఖకే మాయని మచ్చల ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహార శైలి

- యాదాద్రి భువనగిరి జిల్లాలో కీచకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు

హుజూర్ నగర్: మైనర్ బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.హుజూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నాయిని అనిల్ కుమార్ కు గతంలో వివాహం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది.

దీంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు గట్టిగా ముందలించడంతో మైనర్ బాలిక తల్లిదండ్రుల అనుమతితో ఈ నెల 9న వివాహం చేసుకున్నాడని ఐసిడిసి హుజూర్ నగర్ సెక్టార్ ఇంచార్జి సారెడ్డి సోమమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజూర్ నగర్ యస్ఐ చలికంటి నరేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుడిపై ఫోక్సో కేసు నమోదు అంశంపై పోలీస్ అధికారులు ఆలోచనలో ఉన్నారు.