20 May, 2026 | 5:01 PM

నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ

20-05-2026 03:38 PM

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బ్లూమింగ్ మైండ్స్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇటీవల విడుదలైన నవోదయ ఫలితాలలో ప్రతిభ చాటారు. బాన్సువాడ పట్టణం చరిత్రలో మొట్టమొదటిసారిగా నవోదయ 2026 ఫలితాలలో 25 మంది విద్యార్థులకు గాను 9 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి నవోదయలో ప్రవేశం పొందడం జరిగిందని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు, ఉత్తమ ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని అందుకే ఫలితాలు సాధించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.