అపూర్వ ఫ్లోరెట్స్ స్కూల్ లొ అధిక ఫీజుల దోపిడీ
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణ కేంద్రంలోని, మంకమ్మ తోటలో గల, అపూర్వ ప్లోరెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధిక ఫీజుల దోపిడీ జరుగుతుందని ఎం ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు భరత్ తెలిపారు. ఫీజు దోపిడీ కాకుండా యునిఫామ్స్ ,షూ బెల్ట్, ఇలా విచ్చలవిడిగా, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ, అద్దాల బిల్డింగ్లలో, Ac, ఇంటర్నేషనల్, అంటూ తోక పేర్లతో, తల్లిదండ్రులను ఆకర్షిస్తూ కోట్లాది రూపాలు దండుకుంటున్నారని తోటపల్లి భరత్ ఆవేదన వ్యక్తం చేశారు, అయితే విద్యాశాఖ అధికారులు, జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న అధికారులకు ఏమీ తెలియనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. గురువారం MSF ఆధ్వర్యంలో తోటపల్లి భరత్, మరియు MSF జిల్లా ఉపాధ్యక్షులు అపూర్వ ప్లోరెట్స్ స్కూలు, ఎదుట ధర్నా నిర్వహించి, నిరసన తెలియజేశారు, తక్షణమే విద్యాశాఖ అధికారులు ఈ స్కూలు పై చర్యలు తీసుకోకపోతే, MSF ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.






