calender_icon.png 20 February, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎస్‌ఈసీటీ, జెన్‌ప్యాక్ట్ ఆధ్వర్యంలో స్కిల్ బిల్డ్

20-02-2026 01:00:53 AM

హనుమకొండలో సీఎస్‌ఆర్ కార్యక్రమప్రారంభోత్సవం

హనుమకొండ, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఏఐఎస్‌ఈసీటీ, జెన్‌ప్యాక్ట్ ఆధ్వర్యంలో ‘స్కిల్ బిల్డ్’ అనే సీఎస్ ఆర్ కార్యక్రమాన్ని గురువారం అధికారికం గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నై పుణ్యాలను అందించి, వారిని ఉద్యోగాలకు సిద్ధంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నా రు.

ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం భారతదేశం లోని జైపూర్, జోధ్‌పూర్, లక్నో, కోల్‌కతా, మధురై, వరంగల్  వంటి ఆరు ప్రాంతాల్లో అమలు చేయబడుతోంది.తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలోని ఎంవీఆర్ కన్వెన్ష న్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యా, కార్పొరేట్ రంగాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భాగంగా వరంగగల్‌లో అభ్యర్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ అందించనున్నారు.

ఏఐఎస్‌ఈసీటీ తరఫున భోస్లే రూపానంద విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం లో నిర్మాణాత్మక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. జెన్ ప్యాక్ట్ తరఫున అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ ఆర్. విఘ్నేష్ పాల్గొని యువత నైపుణ్యాభివృద్ధికి తమ సంస్థ సీఎస్‌ఆర్ ద్వారా చేస్తున్న కృషిని వివరించారు. హనుమకొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్  బి. నవీన్ కుమార్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ జోనల్ హెడ్ (దక్షిణ) శ్రీనాథ్ గట్టు  హాజరై వ్యక్తిత్వ వికాసం,

ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంత రం శిక్షణలో చేరిన అభ్యర్థుల కోసం ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. జెన్‌ప్యాక్ట్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ శ్వేత వేముల రోల్ మోడల్ టాక్ ద్వారా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు, ప్రాక్టికల్ మార్గదర్శకత్వం అందించారు. ఈ భాగస్వామ్యం పరిశ్రమవిద్యా సంస్థలుఎన్జీఓల మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరచి, గ్రామీణస్థాయిలో నైపు ణ్యంతో కూడిన, ఆత్మవిశ్వాసం గల యువతను తీర్చిది ద్దడం లో ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు.