27 May, 2026 | 3:22 AM

నేరాల నియంత్రణ కోసం నాకాబంది

27-05-2026 02:03 AM

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ 

హనుమకొండ, మే 26 (విజయక్రాంతి): నేరాల నియంత్రణతోపాటు పాత నేరస్తులను గుర్తించేందుకు నాకా బందీ తనిఖీలు నిర్వహిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సోమవారం సా యంత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  పొలీసులు చేపట్టిన నాకాబందీ తనీఖీ ల్లో పోలీసులు మొత్తం 11,286 వాహనాలను తనిఖీ చేయబడ్డాయని, ఇందులో సెం ట్రల్ జోన్ పరిధిలో 5626 వాహనాలు, ఈస్ట్జోన్ పరిధిలో 2591, వేస్ట్ జోన్ పరిధిలో 2057, ట్రాఫిక్ పరిధిలో 992 వాహనాలను తనిఖీ చేసి 275 వాహనాలను సీజ్ చేశామని.

దీనితో పాటు ఈ తనిఖీల్లో మద్యం సేవించి 197 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడటం జరిగిందని. వీటితో పాటు శాయంపేట పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న  ట్రాక్టర్లపై రెండు కేసులు నమోదు కాగా, దామెర పోలీస్ స్టేషన్ అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేయగా, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనుమానిత వ్యక్తిని అదుపు తీసుకోవడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన తెలిపారు.