7 May, 2026 | 3:15 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

తెలంగాణ జాగృతి బీసీ విభాగం అధ్యక్షుడిగా శివశంకర్

20-02-2026 02:08 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా బీసీ విభాగం అధ్యక్షునిగా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కుమ్మరి శివశంకర్ నియమితులయ్యారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సామాజిక తెలంగాణ సాధనలో భాగంగా బీసీ వర్గాల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తనని ఆయన పేర్కొన్నారు.

జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో జిల్లావ్యాప్తంగా బీసీ యువతను ఏకం చేసి, సంస్థను మరింత బలోపేతం చేయాలని పాండురంగారెడ్డి సూచించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు శివశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకగా ఉంటూ, జిల్లా మరియు మొయినాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు.శివశంకర్ నియామకం పట్ల తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.