28 March, 2026 | 12:27 AM

అంబారిపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

27-03-2026 10:19 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీరంగా కృష్ణమాచారి వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్య గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.