28 March, 2026 | 12:28 AM

కడ్పాల్‌లో ఎంవీఆర్ క్రికెట్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

27-03-2026 10:32 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఎం.వి.ఆర్ టోర్నమెంట్ డ్రా 30-03-2026 మ్యాచ్ ప్రారంభం 01-04-2026 కానుంది. ఆసక్తి కల జట్టులు పాల్గొనే సువర్ణ అవకాశం కాబట్టి దీనిని క్రికెట్ ఆటగాళ్ళు పాల్గొనాల్సిందిగా సర్పంచ్ విమల విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో గెలుపొందిన వారికీ మొదటి బహుమతి రూ.33333, రెండవ బహుమతి రూ.22222 ఉంది. ఎంట్రీ ఫీజ్ రూ" 1500 చెల్లాల్సింది.

ఇందులో పాల్గొనే జట్టుకు నియామ నిబంధనలు: డ్రా తేదికి ముందె మీ యొక్క టీం డబ్బులు చెల్లించి టీం పేరు నమోదు చేసుకోగలరు. ప్రతి లీగ్ మ్యాచ్లకు 10 ఓవర్లు సెమిపైనల్ 12 & ఫైనల్ కు 12 ఓవర్లు, ప్రతి జట్టులో 4 మంది బౌలర్లు తప్పనిసరి. ప్రతి ఇన్నింగ్స్ కు కొత్త బంతి ఇవ్వబడును. క్రీడాకారులు తమ యొక్క టీం మేనేజ్మెంట్ క్కుతగిన సమయం ఇచ్చి వారికి పూర్తిగా సహకరించాలి. క్రీడాకారులు ఎలాంటి వివాదాలకు ఎలాంటి తావు లేకుండా సహకరించాలి.

తుది నిర్ణయం నిర్వహకులు మరియు అంపైర్లది మాత్రమే. ఆర్గనైజర్స్ నిర్ణయించిన టైమ్ లో టీమ్ సభ్యులు టైమ్ కి రానాయేడల మ్యాచ్ కి సంబందించిన ఓవర్లను కుదించబడును. ఎవరి క్రీడా సామగ్రి వారి టీమ్ తెచ్చుకోగలరు. ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వబడును. బెస్ట్ బ్యాట్ మేన్స్, బెస్ట్ బౌలర్, టోర్నిలో అత్యుత్తమ ప్రదర్శన్ కనబర్చిన వారికి మ్యాన్ ఆఫ్ ద సీరిస్ ఇవ్వబడును. ప్రతి మ్యాచ్ కి 3 ఓవర్లు పవర్ ప్లే ఉండబడును. మీరు సంప్రదించాల్సిన నంబర్ విమల విట్టల్ రెడ్డి కడ్పల్ సర్పంచ్ 8008465030, ఉపసర్పంచ్ జి.రమేష్ 9515728343, ఎం.సంతోష్ 8466918545, ఎన్.శివాజీ 8008055898, కె.గణపతి 9100868086.