28 March, 2026 | 12:22 AM

మల్కాపూర్‌లో ఘనంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

27-03-2026 10:24 PM

బీబీపేట్,(విజయక్రాంతి): బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించగా, గ్రామ సర్పంచ్ నాగరాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.