27 March, 2026 | 5:01 PM

శ్రీ సీతారాముల కళ్యాణం.. చూతము రారండి

27-03-2026 03:09 PM

సీతారామ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్‌నగర్,(విజయక్రాంతి): శ్రీ సీతారాముల కళ్యాణం.. సీతము రారండి.. అంటూ తరలివచ్చిన వేలాది భక్తులతో పాటు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, వైస్ చైర్మన్ అందేమోహన్, బిజెపి నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు  కందివరం సూర్యప్రకాష్, వంకాయల నారాయణరెడ్డి, రఘునాథ్ యాదవ్, కుమార్ గౌడ్, ఫరూక్ నగర్ (జానంపేట) పట్టణంలో జరిగిన సీతారామ కళ్యాణ ఉత్సవానికి తరలివచ్చారు.

ఉత్సవంలో పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు వారిని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఏ మచ్చ లేకుండా రాజ్యాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక మయమైన ఈ ఉత్సవంలో పాల్గొనడం తనకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి  ప్రతాప్ రెడ్డి సీనియర్ నాయకులు హాజరై కళ్యాణ మహోత్సవ తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అంధే మోహన్ ముదిరాజ్,మాజీ  మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, మురళీ మోహన్, దిలీప్, బచ్చలి నరేష్,  మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, ముబారక్ అలీ ఖాన్, సాధిక్, మాధవులు యాదవ్, యదిగిరి యాదవ్,శ్రీ నివాస్, తదితరులు పాల్గొన్నారు.