27 March, 2026 | 4:57 PM

నేత్ర పర్వంగా రాములోరి కళ్యాణ..

27-03-2026 03:06 PM

ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోశ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి అట్టహాసంగా జరిగింది. 11 గంటలకు కళ్యాణ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛరణాల మధ్య సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్, రమాదేవి, మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్, రామాలయం కమిటీ చైర్మన్ బండిరాము, మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ స్వరూప, రామాలయం కమిటీ డైరెక్టర్లు వివాహ హోత్సవం వేదికపై కూర్చున్నారు. వేలాది మంది భక్తుల మధ్య సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ వేడుకల్నిభక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కళ్యాణ వేడుకల. వీక్షణం కోసం భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్న భక్తులకు వేడుకల్ని కళ్యాణ వేడుకలలో బెల్లంపల్లి మునిసిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, నాయకులు చిలుముల శంకర్, మునిమంద రమేష్,కాంగ్రెస్ ప్రధాన  నాయకులు జమ్మికుంట విజయ్ కుమార్, బండి ప్రభాకర్, మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు,ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు బందోబస్తును నిర్వహించారు.

స్వచ్ఛంద సేవలు..

సీతారాముల కల్యాణ వేడుకల్ని పురస్కరించుకొని భక్తు లకు స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించారు. మజ్జిగ, అంబలి, రస్నా, అందించారు. మార్వాడి యువ మంచ్, తిలక్ వాకర్ అసోసియేషన్, గౌస్  ఏ అజమ్ వెల్ఫర్ అసోసియేషన్ నేతృత్వంలో సేవలు అందించారు. ఇదిలా ఉండగా కళ్యాణ వేడుకలకు వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో మహా అన్నదానం చేశారు. వేలాది భక్తుల ఆకలిదప్పులు తీర్చారు.