27 March, 2026 | 5:43 PM

ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన

27-03-2026 03:44 PM

హైదరాబాద్: అనేక ఆలోచనలకు నిజామాబాద్ కేంద్రమైందని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లయినా.. ప్రధాన ఆశయాలు నెరవేరలేదని ఆరోపించారు. నీళ్లు, నియామకాలు, నిధులు వంటి ఆశయాలు నెరవేరలేదన్నారు. అందరికోసం పనిచేసేలా నూతన పార్టీ ఉండాలన్నారు. ప్రజల కోసం కొత్త పార్టీ కావాలన్నారు. మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా విశ్వసిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ సర్వోదయం కోసం నూతన పార్టీ రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతి ద్వారా అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్లు కవిత ప్రకటించారు. మేడ్చల్ మునీరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ లో ఏప్రిల్ 25న కొత్త పార్టీ ప్రకటిస్తామని నిజామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు.. జెండాను ప్రకటిస్తామని తెలిపారు. యువత, మహిళలకు తన పార్టీలో మంచి స్థానం ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఇన్నాళ్లూ మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారన్న కవిత తెలంగాణ ఆడబిడ్డగా తాను పెట్టే పార్టీ ఎలా ఉంటుందో మీరే చూస్తారని కవిత చెప్పారు.