27 March, 2026 | 5:32 PM

సీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ

27-03-2026 03:21 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి తరపున వారి కుటుంబ సభ్యులు అందజేత

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): పట్టణంలోని జన్కపూర్‌లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో  ఎమ్మెల్యే కోవ లక్ష్మి  తనయుడు, యువ నాయకుడు కోవ సాయినాథ్ తన సతీమణి హారికతో కలిసి పాల్గొన్నారు. వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మునిసిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్,  మున్సిపల్ కౌన్సిలర్ చిలువరి వెంకన్న, ప్రజాప్రతినిధులు,  నాయకుల, భక్తులు పాల్గొన్నారు.