వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు విజయ రమణారావు
సుల్తానాబాద్ లో నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): జై శ్రీరామ్... జై జై శ్రీరామ్.. అంటూ భక్తుల నినాదాలతో శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మారు మోగింది, శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు నేత్రపర్వంగా వైభవంగా జరిగాయి, ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి, ఆధ్యాత్మికత నిండుకున్నాయి, సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, బొంతకుంటపల్లి, కాట్నపల్లి , ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామాల్లో, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్, మార్కండేయ యుకాలనీ శ్రీ రామనవమి మహోత్సవని పురస్కరించుకొని శుక్రవారం రోజున పలు రామాలయాల్లో శ్రీ.సీతారాముల కల్యాణాన్ని వీక్షించి ఆలయాల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా అర్చకులు గ్రామ ప్రజలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయరమణ రావు ను ఘనంగా సత్కరించారు..అనంతరం పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఊరేగింపు పల్లకి సేవా మహోత్సవంలో పాల్గొనడం జరిగింది... కాగా సుల్తానాబాద్ పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయం వద్ద సీతారాముల కల్యాణోత్సవం వేడుకల్లో ఆలయ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్,
పట్టణ ఆర్యవైశ్య సంఘం క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు, అర్చకులు అభిలాష్ శర్మ, శ్రవణ్ కుమార్ శర్మ, వినయ్ త్రిపాటి లు స్వామి వారి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు, అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు, అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సామాజిక సేవకులు కత్తెర్ల పోచమల్లు , సంతోష్ , పిడుగు విమల, సాదుల కర్ణాకర్ , మేంగాని శ్రీనివాస్, గొట్టం రాజు పలువురు ఉన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , పలు గ్రామాల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




