10 March, 2026 | 7:04 AM

ఏసీబీకి చిక్కిన ఎస్సైలు

10-03-2026 02:26 AM
  1. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు సైబర్ క్రైమ్ ఎస్సైలు
  2. ఓ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్

ఎల్బీనగర్, మార్చి 9: న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే న్యాయానికి వేలం వేసి, లంచం డిమాండ్ చేసి ఏసీ బీకి చిక్కారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు కాకుండా ఉం డాలంటే అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధి కారులు వలపన్ని సోమవారం ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలను పట్టుకున్నారు.

ఆర్మ్ డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్‌గౌడ్, జటావత్ బాబునాయక్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటంతోపాటు అకౌంట్ ఫ్రీజ్ చే యకుండా ఉండాలంటే బాధితులను రూ.మూడు లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు రూ.లక్ష ఇస్తామని ఒప్పుకుని, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఎల్బీనగర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సోమవారం దాడులు చేశారు. ఈ సమయంలో బాధితుల నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటుండగా ఇద్దరు ఎస్సైలను పట్టుకున్నారు. వారిని నాంపల్లిలోని ఏసీబి కోర్టు అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.