19 August, 2026 | 4:55 AM

సర్ ప్రక్రియలో సిర్పూర్ నియోజకవర్గం బెస్ట్

19-08-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లో సిర్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రన్ గ్రాండ్లో ఎమ్మెల్సీ దండే విఠల్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ఫేజ్-2 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి బూత్ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా నిలిపిన ఎమ్మెల్సీ దండే విఠల్ను మంత్రి అభినందించారు. ప్రజలకు ఎస్ ఐ ఆర్ పై పూర్తి అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బి ఎల్ ఏ లు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కోరారు.

ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, మార్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, ఇరుకుళ్ల మంగతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బి ఎల్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.