13 May, 2026 | 3:34 PM

సింగోటం-గోపాలదిన్నె కెనాల్ పనులు వేగవంతం

13-05-2026 02:37 PM

భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి సమావేశం.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి):  మంత్రి జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Rao) బొల్లారం గ్రామంలో భూబాధిత రైతులతో బుధవారం సమావేశమై సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువ కంటే మూడింతల పరిహారం చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను రూ.3.75 లక్షలకు పెంచి, భూసేకరణ చట్టం ప్రకారం వడ్డీతో కలిపి ఎకరాకు రూ.11.50 లక్షల వరకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అసైన్డ్ భూములు, పట్టా లేని పేద రైతులకు కూడా సమాన పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.