13 May, 2026 | 3:32 PM

పప్పు ధాన్యాల సాగుతో లాభాలు

13-05-2026 02:42 PM

- ప్రొఫెసర్ జయశంకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 

మంచిర్యాల,(విజయక్రాంతి): వరి ఏక పంట సాగును తగ్గించి, పంటల వైవిధ్యీకరణలో భాగంగా పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయల సాగు చేపట్టి నేల సారాన్ని పెంచుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జే సాయి ప్రసాద్ సూచించారు. బుధ వారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (RMS) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ శివకుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు.

రసాయన ఎరువులు, అధిక మోతాదులో పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి, నేల ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతతో పాటు మానవ ఆరోగ్యంపై కలిగే హానికర ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరి సాగులో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (AWD) పద్ధతి ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల సమర్థ వినియోగం, సహజ సేంద్రియ ఎరువులతో సమగ్ర వ్యవసాయ విధానం (IFS) అనుసరించడం ద్వారా వనరుల సమర్థ వినియోగం, జీవనోపాధి భద్రత సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ, గ్రామ సర్పంచ్ సంధ్య స్వామి, ఉప సర్పంచ్ పయ్యావుల నరేందర్, ATMA Director జగన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) కొమురయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.