13 May, 2026 | 3:32 PM

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే లక్ష్యం

13-05-2026 02:38 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ - ఉట్నూరు ప్రధాన రహదారిపై గత రెండేళ్లుగా నిలిచిపోయిన ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు.కెరమెరి ఘాట్ నుంచి టింకపల్లి వరకు దెబ్బతిన్న రహదారితో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పవర్‌గూడ నుంచి టింకపల్లి వరకు ప్యాచ్ వర్క్ పనులు బుధవారం ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే  పనులను  పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఘాట్ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే తెలిపారు.పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారానికి కాంట్రాక్టర్ ముంతాజ్‌కు భరోసా కల్పించారు.నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో పనులు తిరిగి ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెంట బిఆర్ఎస్ నాయకురాలు మార్సుకోల సరస్వతి ఉన్నారు.