22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం

22-05-2026 06:20 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ని మఠంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి ప్రాంతంలో గల సమస్యలను ఎస్సై దృష్టికి తేవడం జరిగినది,ముఖ్యంగా కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు గురించి చర్చించి ఎస్సై దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. యువతడ్రగ్స్ బారినబడి తమ జీవితాలను బలి చేసుకుంటున్నారని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి ను  సమాజంలో సమూలం గా నిర్మూలించే కార్యక్రమం లో భాగంగా తమ వంతు కృషిగా చట్టానికి సహకరిస్తామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు.