14 July, 2026 | 3:29 PM

Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •  

మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం

02-05-2026 07:12 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీం ఆధ్వర్యంలో కేసముద్రం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో  ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా మహిళల భద్రత గురించి ఉప్పరపల్లి, బిచ్చ నాయక్ తండా, సప్పిడి గుట్ట తండాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న మహిళా కూలీల భద్రతను దృష్టిలో ఉంచుకుని షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ప్రత్యేకంగా పని ప్రదేశంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై సునంద మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత, అలాగే పని ప్రదేశాలలో జరిగే దోపిడీ, వేధింపులు, మోసపూరిత చర్యల గురించి వివరించారు. వ్యక్తిగత భద్రతా చర్యలు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, పోలీస్ సహాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఎటువంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మహిళలకు డయల్ 100/112, మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935, ఇతర అత్యవసర సేవలు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్1930 గురించి వివరాలు తెలియజేశారు. గ్రామ స్థాయిలో సమిష్టి సహకారంతో భద్రతా వాతావరణాన్ని సృష్టించుకోవాలని, మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పనుల నిర్వహకులు, షీ టీం ఏఎస్ఐ సుధాకర్, అరుణ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.