1 July, 2026 | 6:31 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

రాహుల్ గాంధీతో శశి థరూర్ భేటీ

30-01-2026 12:00 AM
  1. తనపై ప్రచారానిన కొట్టిపారేసిన ఎంపీ
  2. మేమందరం ఒకే తాటిపై ఉన్నామని ‘ఎక్స్’లో పోస్టు

న్యూఢిల్లీ, జనవరి29 : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురువారం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. పార్టీలో విభేదాల ఊహాగానాలను తోసిపుచ్చు తూ, ఈ భేటీ ఒక సాధారణమైనదని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశానికి ముందు న్యూ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, థరూర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశా రు. ‘నేను ఇప్పుడు పార్లమెంటుకు వెళ్తున్నాను. అది జరిగినప్పుడు నేను మీకు తెలియజేస్తాను.

నా సొంత పార్టీ నాయకుడిని కలవడంలో అంత అసాధారణం ఏముంది?’ అని ఆయన అన్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశం గం టకు పైగా కొనసాగింది. బుధవారం కొత్త పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో థరూర్ రాహుల్‌గాంధీ, ఖర్గే ఇద్దరి తోనూ చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావే శానికి హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే శశిథరూర్ ఈ సమావేశానికి సంబంధించిన ఒక చిత్రాన్ని తన ఎక్స్‌ఖా తాలో పోస్టు చేస్తూ.. తనకు, కాంగ్రెస్ అధినాయకత్వానికి మధ్య అంతా సవ్యంగా ఉందని పేర్కొన్నారు. ‘వివిధ అంశాలపై ఈరోజు జరిగిన ఆత్మీయ, నిర్మాణాత్మక చర్చ జరగినందు కు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. భారతదేశ ప్రజల సేవలో ముందు కు సాగుతున్నప్పుడు మేమందరం ఒకే తాటిపై ఉన్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు.