15 May, 2026 | 1:37 PM

చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి

15-05-2026 12:13 PM

పోలీసుల ప్రచారం

బోథ్,(విజయక్రాంతి): వేసవికాలంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులతో కలిసి గ్రామం సమీపంలోని చెరువులు కుంటలు వాగులలోకి ఈత కోసం వెళ్తుంటారని ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కుంటలు చెరువులు ఉన్న గ్రామాల సమీపంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కలిగిస్తున్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చిన్న పిల్లలను చైతన్యం చేయడం జరుగుతుంది. కోసం సరదాగా నీటిలో దిగి ఈత కొట్టే ప్రయత్నం చేస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని లోతున స్థలాలలోకి వెళ్లి నీటిలో దిగవద్దని తెలుపుతున్నారు. తీవ్రమైన ఎండల దృశ్య వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన చర్యల గురించి తెలుపుతున్నారు.