15 May, 2026 | 1:35 PM

నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్

15-05-2026 12:11 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించి నేర రహిత సమాజంగా తీర్చిదిద్దామని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లక్ష్మీ నగర్ కాలనీ సిడిఎస్ భవన్ లో సైబర్  అవగాహన శాసనం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సప్ స్టేటస్ ల అప్రమత్తంగా ఉండి అపరిచిత  వ్యక్తి నుండి వచ్చే కాల్స్ మెసేజ్లు పట్ల  జాగ్రత్త  వహించాలని తెలిపారు. డ్రగ్స్ అనర్ధాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత తో పాటుగా సైబర్ నేరాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్న వారు 1930 సమాచారం ఇస్తే తిరిగి డబ్బు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు  పాల్గొన్నారు