12 August, 2026 | 11:05 AM

సాటాపూర్‌లో నడిరోడ్డుపై నిలిచిన మురుగునీరు

12-08-2026 12:49 AM

బోధన్ ఆగస్టు 11 (విజయ క్రాంతి): రెంజల్ మండలం గ్రామపంచాయతీ సాటపూర్ 8వ వార్డులో రోడ్లపై మురికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దలు, పిల్లలు, బడికి వెళ్లే విద్యార్థులు ఈ దుస్థితితో సతమతమవుతున్నారు. ఈ సమస్యపై సెక్రటరీ, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మురికి నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉందని, పిల్లలు బురదలో పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.