పేకాట రాయుళ్ల అరెస్టు
27-03-2026 10:16 PM
మిర్యాలగూడ,(విజయక్రాంతి): పట్టణంలోని బంగారిగడ్డ కాలనీలో నివాస గృహంలో పేకాట (జూదం) ఆడుతున్న ఏడుగురుని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సోమ నరసయ్య, ఎస్సై రాంబాబులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఇంటిపై తనిఖీ చేయగా, పట్టణానికి చెందిన ఏడుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి రూ. 9,213 నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే డయాల్, 100 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ కళ్యాణ్,సమద్, రాజశేఖర్, అఖిల్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.




