28 March, 2026 | 2:10 AM

మేవా ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

28-03-2026 12:04 AM

బూర్గంపాడు,మార్చి27,(విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు సారపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా)వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి. ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్. మేవా కమిటీ సభ్యులు మహమ్మద్ ముస్తఫా షేక్ జహీర్ పాషా,అజీమ్ భాయ్,అబ్దుల్ సలీం,హఫీజ్, అక్బర్, సోహెల్ పాషా,యూసుఫ్,అజీజ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.