28 March, 2026 | 2:10 AM

ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు

28-03-2026 12:02 AM
  1. డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి

పెద్దగూడెంలో ఘనంగా కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

వనపర్తి, మార్చి 27 ( విజయక్రాంతి ) : ఎన్ని యుగాలైనా ఆదిపురుషుడుగా పిలువబడుతున్న శ్రీరాముడు అన్ని యుగాలకు ఆదర్శప్రాయుడు అని డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. చారిత్రాత్మకమైన పుణ్య దేవాలయంగా ఉన్న శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా దేవాల య ఆలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షులు, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోదం డ రామస్వామి బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక, సేవ కార్యక్రమాలను తిలకించారు. ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, బ్రహ్మచారి, శివసేనారెడ్డి కుటుంబ సభ్యులు పుల్లారెడ్డి, పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, ఉపసర్పంచ్ పోల్లికమ్మ, కోదండ రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి పలువురు పాల్గొన్నారు.