13-02-2026 01:09:57 AM
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ ను ప్రతి ఒక్క రూ ఆదర్శంగా తీసుకోవాలని డిసిసి అధ్యక్షురాలు సుగుణ అన్నారు.జయంతి ఉత్స వాల సందర్భంగా వాల్ పోస్టర్లను జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ కలసి గురువారం ఆవిష్కరించారు.
జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు చౌహన్ గునవంత్ రావ్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాథోడ్ రూపులాల్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, జాతి పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కే. హరిత, అజ్మీరా శ్యాంనాయక్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, మాజీ శాసన సభ్యులు ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగలను మర్యాదపూర్వకంగా కలసి జయంతి సభకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్. రమాదేవి, సలహాదారులు రాథోడ్ అంబాజీ, రాథోడ్ సేసేరావ్, కమిటీ సభ్యులు బానోత్ గోపాల్ నాయక్, పవార్ రవీందర్, దారావత్ ప్రవీణ్, చౌహన్ సునీల్, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.