8 June, 2026 | 9:32 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •   తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి   •   కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది   •   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి   •   ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి   •   పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా   •   కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి   •  

సింగరేణి కార్మిక లోకానికి కొమురయ్య అందించిన సేవలు చిరస్మరణీయం

08-06-2026 08:08 PM

బొగ్గుగనుల్లో ఎనిమిది గంటల పనివిధానం సాధించిన ఘనత కొమురయ్యదే

కార్మికులకు మెరుగైన జాతీయ వేతన ఒప్పందాలు సాధించిన వీరుడు

సమ్మెలు, పోరాటాల ద్వారా కార్మికులకు ఎన్నో హక్కుల సాధించిన యోధుడు కొమురయ్య

సింగరేణి హెడ్డాఫీసు ఎదుట ఘనంగా యూనియన్ కొమురయ్య కాంస్య విగ్రహా పునప్రతిష్ఠ

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమురయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్య్ర సమరయోధులు మనుబోతుల కొమురయ్య (యూనియన్ కొమురయ్య) కాంస్య విగ్రహాన్ని ఆయన పునప్రతిష్టించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొగ్గుగనుల్లో ఎనిమిది గంటల పనివిధానాన్ని సాధించిన ఘనత  కొమురయ్యదేనని కొనియాడారు.

నాటి రోజుల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న కాంట్రాక్టు విధానాన్ని కొమురయ్య తన వీరోచిత పోరాటాల ఫలితంగానే వెనక్కు పంపించగలిగాడని గుర్తుచేశారు. ఆనాడు భూగర్భగనులలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. పది సంవత్సరాలలోపు వయసున్న చిన్నపిల్లలతో పనులు చేయించుకునే అమానవీయ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, సింగరేణి బొగ్గు గనుల్లో బాల కార్మిక వ్యవస్థకు అనాడే స్వస్థి పలికించిన మహోన్నత వ్యక్తి, సంఘటిత, అసంఘటిత కార్మికుల ఆశాజ్యోతి కొమురయ్య అని ప్రశంసించారు.

రేగే, జాదవ్ కమిటీల ద్వారా, ముజుందాస్, దాస్గుప్తా, రఘునాథ్ రెడ్డి అవార్డుల ద్వారా కార్మికులకు ఎనలేని లబ్ధి చేకూర్చారన్నారు. పలు జాతీయ వేతన ఒప్పందాలు, చారిత్రాత్మక సమ్మె పోరాటాల ద్వారా నల్లసూర్యులైన కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిపెట్టిన ఘనత కేవలం కొమురయ్యకే దక్కుతుందని స్పష్టం చేశారు. కొత్తగూడెం ప్రాంత సంఘటిత, అసంఘటిత కార్మికులను ఏకం చేసి ఎన్నోపోరాటాలు నిర్వహించి హక్కులు సాధించిపెట్టారని, కార్మికుడికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా ఇచ్చిన మహానేత కొమురయ్య అని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కార్మిక హక్కుల రక్షణకై, ఆశయ సాధనకై కార్మికులంతా కదలాలని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.