8 June, 2026 | 9:34 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •   తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి   •   కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది   •   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి   •   ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి   •   పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా   •   కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి   •  

ఉద్యోగాల కల్పనకు 'సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర'

08-06-2026 08:04 PM

- అప్లైవిజ్ సంస్థ భాగస్వామ్యంతో పోర్టల్: సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట యువతను సాధికారిత వైపు నడిపించడమే లక్ష్యంగా 'సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర' పోర్టల్ ను ప్రారంభిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. సిద్దిపేట పోలీస్, అప్లైవిజ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్‌సైట్ పోర్టల్‌ను  సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హతలను బట్టి నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని  నిరుద్యోగులకు తగిన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా ఈ వెబ్ పోర్టల్‌ https://www.siddipetpoliceudyogamithra.com//ను ప్రారంభించినట్లు  చెప్పారు. పోలీస్ శాఖ అందిస్తున్న ఈ డిజిటల్ పోర్టల్ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కుషాల్కర్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, అప్లైవిజ్ సీఈవో శ్యామ్ సంకీర్త్, ఏసీపీలు, సీఐలు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.