3 July, 2026 | 2:22 AM

మేక మాంసంలో ఎద్దు కూర!

03-07-2026 01:16 AM
  1. హైదరాబాద్‌లో తక్కువ ధరకే హోటళ్లకు సరఫరా
  2. మల్లెపల్లి ప్రాంతానికి చెందిన నిందితుడి అరెస్టు
  3. 50 కిలోల మాంసం సీజ్

సీటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో చికెన్, మటన్ ప్రియులను బెంబేలెత్తించే మరో ఘోరకల్తీ వ్యవహారం వె లుగుచూసింది. మేక మాంసంలో పెద్ద ఎత్తు న ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ షాకింగ్ ఘటన హబీబ్‌నగర్ పో లీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మల్లెపల్లి ప్రాంతానికి చెందిన ఉస్మాన్ ఖురే షి కొంతకాలంగా మటన్ వ్యాపారం చేస్తున్నాడు. లాభాల కోసం అడ్డదారి తొక్కాడు. మార్కెట్‌లో మేక మాంసం ధర కంటే ఎద్దు మాంసం ధర చాలా తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నాడు. మేక మాంసంలో పెద్ద ఎత్తున ఎద్దు మాంసాన్ని కలిపి ప్యాక్ చేయడం ప్రారంభించాడు.

ఈ మాంసాన్ని నగరంలోని పలు బిర్యానీ పాయింట్లు, చిన్న, మధ్యతరహా హోటళ్లకు అత్యంత తక్కువ ధరకే సరఫరా చేస్తున్నాడు. తక్కువ ధరకు వస్తుండటంతో కొందరు హోటల్ నిర్వాహకులు కూడా నిజానిజాలు పట్టించుకోకుం డా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరా బాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా మల్లెపల్లిలోని ఉస్మాన్ ఖురేషి దుకాణంపై ఆకస్మిక దాడి చేశారు. మేక మాంసంతో పాటు కలిపేందుకు సిద్ధంగా ఉంచిన దాదాపు 50 కిలోల ఎద్దు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఏమాత్రం శుభ్రత పా టించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచడాన్ని గమనించారు. ఉస్మాన్ ఖురేషిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మాంసం నమూనాలను  పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపించారు.