11 April, 2026 | 6:36 PM

సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి

11-04-2026 04:34 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల  పెద్దమ్మ గుడి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత "రాజ్యాంగం- సవాళ్లు" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ... కార్మిక వర్గం ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతూనే సామాజిక అణిచివేత, దౌర్జన్యం పై పోరాడాలన్నారు.

సమాజంలోని కుల వివక్ష, లింగ వివక్ష అంశాలపై లోతుగా అధ్యయనం చేసి ఆ సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలబడాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని అన్నారు. అందుకే సిఐటియు రాష్ట్ర కమిటీ ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సదస్సులు, సెమినార్లు నిర్వస్తున్నామని మహనీయుల వర్ధంతి,జయంతుల ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇదే తరుణంలో నిరంతరం సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు అండగా నిలబడడానికి సామాజిక ఉద్యమ సంఘీభావ నిధి కూడా సేకరించడం జరుగుతుందని అన్నారు, నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నియంత్రిం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. హార్దిక  దోపిడీ, సామాజిక అణిచివేతలపై  జమిలిగా పోరాటాలు నిర్వహించాలని అప్పుడే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు తాండ్ర అంజయ్య, గుమస్తాల సంఘం అధ్యక్షులు మాతంగి రాజమల్లు, ఆపరేటర్ల సంఘం కార్యదర్శి నౌవుండ్ల బ్రహ్మచారి, బండారి స్వామి, శీను, తిరుపతి, ఓదెలు, స్వామి, శీను, రాము, హరీష్, రమేష్, ప్రశాంత్, మల్లేశం, రాజన్న, శంకర్, సంతు, దుర్గయ్య, సుధాకర్ రావు, ప్రసాద్, శ్రీధర్, సంపత్, లింగన్న, మహేందర్, రాజేశం, స్వామి, సతీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.