రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
30-04-2026 12:47 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రానికి చెందిన ఎడ్మ లక్కీ యాదవ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 26న అచ్చంపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో 300 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని సాధించింది. వచ్చే నెల 17న మేడ్చల్ జిల్లా కొల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రస్తుతం అమ్రాబాద్ ప్రోగ్రెసివ్ పాఠశాలలో చదువుతున్న లక్కీ యాదవ్కు గ్రామస్తులు, ఉపాధ్యాయు లు అభినందనలు తెలిపారు.






