29 August, 2026 | 11:35 PM

శివ శివాని డిగ్రీ కళాశాల 'సమావర్తన-2026' గ్రాడ్యుయేషన్ వేడుకలు

29-08-2026 11:06 PM

​కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కోంపల్లిలోని శివ శివాని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శివ శివాని డిగ్రీ కళాశాల 2023–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పట్టభద్రుల కోసం 'సమావర్తన-2026' పేరుతో కాన్వొకేషన్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ​ఈ కార్యక్రమం 2026, ఆగస్టు 30 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు హైనదవ్ గౌరిక్ కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతుంది. విద్యార్థులు సాధించిన విద్యా పురోగతిని, వారి మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారమ్,ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి,ప్రారంభోపన్యాసకులు కొంపెల్ల మాధవీలత పాల్గొననున్నారు.