29 August, 2026 | 11:34 PM

శిక్షణ కార్యక్రమం

29-08-2026 10:50 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఉద్యాన శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలోని  రైతు వేదిక నందు రైతులకు పంట మార్పిడి, కూరగాయల పెంపకం, ఆయిల్ పామ్ పంటపై శిక్షణ కార్యక్రమం శనివారం రోజున నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వేణుగోపాల్ కూరగాయల పంటలలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు వివరిస్తూ, మునగ, బొప్పాయి వంటి తోటలను సాగు చేస్తే తక్కువ సమయంలోనే అధిక ఆదాయాన్ని పొందవచ్చని, బంతి, గులాబీ, లిల్లీ వంటి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

కనీసం 10 గుంటల విస్తీర్ణంలోనైనా సాగు చేయాలని సూచించారు. తదుపరి ఉద్యాన అధికారి కె.స్వాతి మాట్లాడుతూ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలు,కూరగాయలు, పూల తోటలు, ఆయిల్ పంటలు సాగు చేయాలని వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వము వివిధ సబ్సిడీలు రైతులకు అందజేస్తుందని వివరించారు. 70 నుండి90% సబ్సిడీ పై డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు అందుబాటులో ఉన్నాయని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ గ్రామ సర్పంచ్ నూనుగొండ మానస-ప్రవీణ్, ఎఈఓ ఫరీద్, హెచ్ఈఓ ప్రభాకర్, ఆత్మ ఎటిఎం అనూష మరియు రైతులు పాల్గొన్నారు.