24 June, 2026 | 4:10 AM

రైతులకు అవసరమైన విత్తనాలు రైతు వేదికల్లో

24-06-2026 12:35 AM

వ్యవసాయ సంచాలకులు రమేష్

తుంగతుర్తి, జూన్ 23 : మండలంలోని కొత్తగూడెం రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకు లు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రైతు వేదికలో 23-06-2026 నుండి30-06-2026 వరకు విత్తనమేళా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం 7 రకాల వరి సన్న బియ్యం రకాలకు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. 7రకాలు బిపిటి 5204, ఆర్ ఎన్ ఆర్ 15048, జైశ్రీరామ్, హెచ్‌ఎంటి, సోనా, డబ్ల్యూ జి ఎల్ 792, డబ్ల్యూ జి ఎల్ 44 (సిద్ధి), కేఎన్‌ఎం 1638రకాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని తెలియజేశారు. కావున రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తెలియజేసిన ఏడు సన్న రకాలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు ప్రభుత్వం వారి ఉద్దేశించిన బోనస్ కూడా వస్తుందని తెలియజేశారు.

అనంతరం కొత్తగూడెం రైతు వేదికలో కొత్తగూడెంలోని విత్తన డీలర్ లు తమ దుకాణంలోని విత్తనాలను రైతు వేదికలో రైతులు అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి కొత్తగూడెం, గొట్టిపర్తి రైతు వేదికలలో మండలంలోని విత్తన డీలర్లు తమ వద్ద ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచుతారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం రాష్ట్రం మీద ఎల్ నినో ప్రభావం ఉన్నందున వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు వంటి పంటలను వేసుకోవడం ద్వారా రైతులు నష్టాన్ని నివారించుకొని ఈ సీజన్ నుంచి మంచి ఆదాయంతో బయటపడాలన్నారు. దొడ్డు రకాలు రకాలు సాగు చేయటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, మండల వ్యవసాయ అధికారి ఆర్ దేవ ప్రసాద్ ఏ ఈ ఓ లు . జోష్ణ, శ్వేత మరియు పంచాయతీ సెక్రెటరీ, గ్రామ రైతులు పాల్గొన్నారు.