27 July, 2026 | 9:54 PM

ఈత, ఖర్జూర మొక్కల నాటే కార్యక్రమం వేగవంతం చేయాలి

27-07-2026 09:22 PM

ఎక్సైజ్ సూపరింటెండెంట్ తూక్య నాయక్

ఆలేరు,(విజయక్రాంతి):  వడాయిగూడెం గ్రామంలోని ఊర కుంట కట్టపై వికాస్ గ్యారంటీ పథకం ( ఉపాధి హామీ పథకం) VBG RAM G ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈత, ఖర్జూర మొక్కల పెంపక స్థలాన్ని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.తూక్య నాయక్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈత, ఖర్జూర, తాటి వనాల విస్తరణతో గీత కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి, ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు.

సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తామని, నీటి వసతి, రక్షణ చర్యలకు పంచాయతీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐ వేణు కుమార్, ఎస్ఐ గణేష్, పంచాయతీ కార్యదర్శి ఆమని, వార్డు సభ్యులు, గౌడ సంఘం నాయకులు,వికాస్ గ్యారంటీ పథకం ( ఉపాధి హామీ పథకం) VBG RAM G కూలీలు పాల్గొన్నారు.