25 March, 2026 | 2:08 AM

సత్తుపల్లి ఏరియా స్ట్రక్చర్ కమిటీ సమావేశం

25-03-2026 12:25 AM

ఏరియా ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఐఎన్టీయూసీ

సత్తుపల్లి, మార్చి 24  (విజయక్రాంతి) : సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం స్ట్రక్చర్ సమావేశం జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.సత్తుపల్లి ఏరియా పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏరియా అధికారులతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఐ.ఎన్.టి.యూ.సీ నాయకులు కోరారు.స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.

ముఖ్యంగా సత్తుపల్లి డిస్పెన్సరీ లో గైనకాలజిస్ట్ డాక్టర్ను నియమిస్తూ డిస్పెన్సరీని అన్ని వసతులతో కూడిన ఏరియా హాస్పిటల్ గా ఆధునికరించాలని కోరారు. ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారానికి జీ.ఎం కార్యాలయంలో వివిధ డిపార్ట్మెంట్ల మ్యాన్ పవర్ ఏర్పాటు ముఖ్యంగా పర్సనల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి నుండి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి రవాణా జరుగుతున్న సందర్భంగా ఏరియా ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని మరియు 75 % ప్లేడేలు ఇవ్వాలని కోరారు.

ప్రాతినిధ్య సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తుందని , ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధనలో సహకరించారో ఇకముందు కూడా సహకరించి సంస్థ పురోఅభివృద్ధిలో తోడ్పడాలని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్  కోరారు.

ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు బొల్లం శ్రీనివాస్ ( ఎస్ ఓ టు జి.ఎం ) , రామ కృష్ణ ( ఎ జి ఎం సివిల్ ) , మోహన్ రావు ( పర్సనల్ ఆఫీసర్ ) , ప్రహ్లాద్ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , జే.వి.ఆర్ ఓసి ) , సునీల్ వర్మ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , కిష్టారం ఓసి ) , శ్రీనివాస్ రావు ( ప్రాజెక్ట్ ఇంజినీర్ ) , సోమశేఖర్ ( డీజీఎం , జే.వి.ఆర్ సి.హెచ్.పి ) , రాజేశ్వరరావు ( మేనేజర్ , జే.వి.ఆర్ ఓసి ) , రామకృష్ణ ( మేనేజర్ , కిష్టారం ఓసి )  , అభిలాష్ ( సెక్యూరిటీ ఆఫీసర్ ) , సివిల్ ఇంజనీర్ రవికుమార్ , నరసింహారావు ( ఏ సీ.ఎమ్.ఓ , డిస్పెన్సరీ ) ఇతర అధికారులు ,  ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం నాయకులు కోటేశ్వరరావు , క్రాంతి కుమార్ , నాగ ప్రకాష్ పాల్గొన్నారు.