రూ. 176.20 కోట్లతో గిరిజన సహకార సంస్థ వార్షిక ప్రణాళిక
25-03-2026 01:50 AM
ఉట్నూర్, మార్చి 24 (విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ. 176.20 కోట్ల తో వార్షిక ప్రణాళిక ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ తెలిపారు.
ఆమోదం కోసం జీసీసీ మేనేజంగ్ డైరెక్టర్ కి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో డివిజన్ లోని మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, శ్రీనివా స్, రమేష్, మనోహర్, లక్ష్మణ్, సిబ్బంది లింబారావు, సత్యనారాయణ, సంతోష్ పాల్గొన్నారు.




